ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 30, 2020, 7:17 PM IST

ETV Bharat / state

'రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది'

నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం శకునాల పల్లి పంచాయతీలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఆయన అన్నారు.

government giving bigger importance for farmer welfare
రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని భావించి ముఖ్యమంత్రి జగన్ క్షేత్రస్థాయిలో రైతులకు అన్ని రకాల సేవలు అందించేందుకు రైతు భరోసా కేంద్రాలను అందుబాటులోకి తెచ్చారని.. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా శకునాలపల్లిలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. విత్తనం నుంచి పంట దిగుబడి వరకు రైతులకు అండగా ఉండి వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు ఈ కేంద్రాలు ఉపయోగపడతాయన్నారు.

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భరోసా కేంద్రాల సేవలను అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన కియోస్క్ యంత్రం పనితీరును తెలుసుకున్నారు.

ఇదీ చదవండి:దుకాణంలోకి దూసుకుపోయిన 2 లారీలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details