ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాగునీరు మురుగుమయం... ప్రజలకు రోగాల భయం - illness

తాగునీరు దర్వాసన వస్తోంది. నల్లాల్లో మురుగునీరు కలవర పెడుతోంది. నీళ్లు తాగాలంటేనే భయమేస్తోంది. అధికారుల తప్పిదం ప్రజలను రోగాల భారిన పడేస్తోంది. ఇదెక్కడో మారుమూల పల్లెలో అనుకుంటే... పొరపాటే! సుమారు ఎనిమిది లక్షల మంది జీవించే నెల్లూరు నగరం దుస్థితి ఇది.

తాగునీరు మురుగుమయం... ప్రజలకు రోగాల భయం

By

Published : Jun 1, 2019, 9:17 AM IST

తాగునీరు మురుగుమయం... ప్రజలకు రోగాల భయం

నెల్లూరు ఓ మహానగరం. ఎనిమిది లక్షలకు పైగా జనాభాకు ఆశ్రయిమిస్తున్న ప్రాంతం. ఇక్కడ ఓ ప్రధాన సమస్య ఏళ్ల తరబడి వేధిస్తోంది. నిత్యం ఎందరో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సంచరించిస్తున్నప్పటికీ... ఆ సమస్యకు పరిష్కారం లభించటం లేదు. ఫలితంగా కలుషిత నీరే.. వారికి తాగునీరైంది. అదితాగిన ప్రజలు రోగాల బారిన పడి ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు.


నీటి మట్టం తగ్గటంతో...
సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో నీటి మట్టాలు తగ్గడంతో నీరు అడుగంటింది. చెరువు నీటిని శుభ్రం చేసి నగరంలో ఉన్న 24 రక్షిత పథకాల రిజర్వాయర్లకు చేరుస్తారు. ఫిల్టర్ చేసే పథకాలు కూడా సరిగా పనిచేయడం లేదు. పెద్ద పైప్ లైన్లకు రంధ్రాలు పడ్డి నీరు వృథాగా పోతోంది. ఆ నీరు అక్కడే నిలబడి మురుగుగా మారుతోంది. ఆ మురుగునీరే తిరిగి పైప్​లైన్ ద్వారా కొళాయిలకు చేరుతోంది. రోజుల తరబడి నీరు నిల్వ ఉండడం వల్ల దుర్వాసన వస్తోంది.

నిపుణుల సూచనలు బుట్టదాఖలు...
సంవత్సరాల తరబడి నీటి సమస్య నెల్లూరు వాసులను వేధిస్తోంది. దీనిని పరిష్కరించేందుకు ఏడాది క్రితం నిపుణుల కమిటీ నీటిని పరిశీలించింది. పాతకాలం నాటి పైప్ లైన్లు మార్చాలని... చెరువుల్లోకి మురుగు కాలువలు కలవకుండా చూడాలని కమిటీ సూచించింది. కొత్తరకం ఫిల్టర్లను మార్చాలని పేర్కొంది. కానీ ఆ సూచనలన్నీ బుట్టదాఖలయ్యాయి. గత్యంతరం లేని ప్రజలు శుద్ధ జలాన్ని కొనుగోసి తాగుతున్నారు. ఆ స్థోమత లేనివారు మురుగునీటినే తాగుతూ రోగాల బారిన పడుతున్నారు.

నెల్లూరు వాసులకు శుద్ధజలం అందించేందుకు ప్రారంభించిన పథకం రెండేళ్లుగా కొనసా... గుతూనే ఉంది. అధికారుల పనితీరును ఆ పథకం వెక్కిరిస్తోంది.

ఇదీ చదవండీ:అమనాం ప్రజల భయమేంటి? అధికారుల గస్తీ ఎందుకు?...

ABOUT THE AUTHOR

...view details