నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘంలో కరోనా బాధితులు రోజురోజుకి ఎక్కువవుతున్నారు. ఇప్పటికే పురపాలక పరిధిలో 120 కేసులు నమోదు అయ్యాయి. మేనకూరు ప్రత్యేక ఆర్థిక మండలి భూముల(సెజ్)లో ఉన్న కంపెనీల్లో పని చేసే సిబ్బంది.. అధిక సంఖ్యలో కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో బాధితులను ఐసోలేషన్ వార్డుకు తరలించగా.. వారితో సన్నిహితంగా ఉన్న సిబ్బందితో కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. కరోనా వైరస్ సోకి, పోలీసులు, అధికారులు విధులకు హాజరుకావటం లేదు. వైద్యులు సైతం కొవిడ్ బారిన పడటంతో వారు హోం క్వారంటైన్లో ఉంటున్నారు.
నాయుడుపేటలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు
నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలకసంఘం పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి అధికమవుతుంది. ముఖ్యంగా సెజ్ భూముల్లో ఉన్న కంపెనీల్లో పని చేస్తున్న వారు ఎక్కువగా వైరస్ బారిన పడటంతో.. బాధితులను ఐసోలేషన్‌కు తరలించారు.
నాయుడుపేటలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు