ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మేళతాళాలతో ఎద్దుకు అంత్యక్రియలు - శ్రీరంగరాజపురంలో ఎద్దుకు అంతిమయాత్ర వార్తలు

అక్కడ దేవర ఎద్దును నరసింహ స్వామి ప్రతిరూపంగా కొలుస్తారు. అనారోగ్యంతో మృతి చెందిన ఓ ఎద్దుకు మేళతాళాలలతో అంతిమసంస్కారం చేశారు. గోవింద నామస్మరణతో యాత్ర నిర్వహించారు.

bull-death-in-nellore-srirangapuram
bull-death-in-nellore-srirangapuram

By

Published : Feb 4, 2020, 9:55 AM IST

మేళతాళాలతో ఎద్దుకు అంతిమసంస్కారం

నెల్లూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం మంగుంటలో తాతి రెడ్డి వంశస్థులు తమ కులదైవం నరసింహ స్వామికి ప్రతీకగా ఎద్దును పూజిస్తారు. స్వామి అనుగ్రహంతో పుట్టిన ఇలవేల్పుగా గత ఏడేళ్లుగా కొలుస్తున్న ఎద్దు అనారోగ్యంతో మరణించింది. విషయం తెలుసుకున్న తాతిరెడ్డి వంశస్థలు ఎద్దుకు పూజలు నిర్వహించారు. మేళతాళాలలు, పిల్లనగ్రోవి వాయిద్యాల నడుమ ఎద్దుకు శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారం నిర్వహించారు. గోవింద నామస్మరణతో ఎద్దుకు వీడ్కొలు పలికారు.

ABOUT THE AUTHOR

...view details