ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పసుపు పంటకు రూ.10వేల మద్దతు ధర ఇవ్వాలి'

పసుపు పంటకు ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న మద్దతు ధరను పెంచి రూ.10వేలు ఇవ్వాలని ఏపీ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా లింగమనేనిపల్లిలో రైతులతో కలిసి నిరసన వ్యక్తంచేశారు.

ap farmers association dharna in lingamaneni palli nellore district
నెల్లూరు జిల్లాలో ఏపీ రైతు సంఘం నాయకుల ధర్నా

By

Published : May 27, 2020, 7:25 PM IST

రాష్ట్ర ప్రభుత్వం పసుపు పంటకు రూ.10వేల మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ.. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం లింగమనేనిపల్లిలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. రైతు సంఘం జిల్లా నాయకుడు వెంకటయ్య మాట్లాడుతూ... ఎకరం పసుపు పంట సాగుకు లక్షా 20 వేల పెట్టుబడి అవుతోందన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం క్వింటాకు రూ. 6,850 మద్దతు ధర ఇస్తోందని... దీంతో రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.

రూ.10 వేలు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారులు నిబంధనల పేరుతో రైతులను ఇబ్బంది పెట్టకుండా పంట కొనుగోలు చేయాలన్నారు. అన్నదాతలు ఎంతో వ్యయప్రయాసలకోర్చి యార్డుకు తీసుకొచ్చారని.. అలాంటప్పుడు ఏవో చెప్పి వెనక్కి పంపడం సరికాదన్నారు. సాంకేతిక కారణాలతో ఈ- కర్షక్​లో పేరు నమోదు కాని రైతుల నుంచి కూడా పంటను కొనుగోలు చేయాలని కోరారు.

ఇవీ చదవండి.. 'ఆ నలుగురు'... అనాథల అంతిమ సంస్కారాలకు అండగా..!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details