విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ మూడో, అయిదో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ... నెల్లూరులో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు ఆందోళన చేపట్టారు. నగరంలోని వీఆర్సీ సెంటర్ వద్ద రాస్తారోకో చేశారు. విఆర్ కళాశాలలో అధ్యాపకులు కొరత కారణంగా సిలబస్ పూర్తి కాలేదని, ఈ పరిస్థితుల్లో విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారని ప్రశ్నించారు. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
'విఎస్యూ పరిధిలోని డిగ్రీ పరీక్షలను వాయిదా వేయాలి' - nellore latest news
నెల్లూరులో ఏబీవీపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ పరీక్షలను వాయిదా వేయాలని కోరారు. సిలబస్ పూర్తి కానందున, విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారని ప్రశ్నించారు.

నెల్లూరులో ఏబీవీపీ నాయకులు రాస్తారోకో