ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా నేతల వేధింపులు.. ఆశా కార్యకర్త ఆత్మహత్యాయత్నం - చెన్నవరప్పాడు

వైకాపా నేతల వేధింపులతో ఆశా కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన నెల్లూరు జిల్లా చెన్నవరప్పాడులో చోటు చేసుకుంది.

వైకాపా నేతల వేధింపులతో ఆశా కార్యకర్త ఆత్మహత్యాయత్నం

By

Published : Jul 22, 2019, 10:15 AM IST

Updated : Jul 22, 2019, 12:07 PM IST

వైకాపా నేతల వేధింపులు... ఆశా కార్యకర్త ఆత్మహత్యాయత్నం

నెల్లూరు జిల్లా సంగం మండలం చెన్నవరప్పాడులో ఆశా కార్యకర్త ఒకరు ఆత్మహత్యాయత్నం చేశారు. నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి ప్రయత్నించారు. గ్రామానికి చెందిన వెంకట రమణమ్మ అనే మహిళ దాదాపు 14 సంవత్సరాల నుంచి సంగం హీహెచ్​సీలో ఆశా వర్కర్ గా పని చేస్తోంది. తన భర్త చిరంజీవి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెదేపాకు మద్దతుగా నిలిచారన్న అక్కసుతో వైకాపా నాయకులు వేధిస్తున్నారని ఆమె తెలిపింది. విధులు సక్రమంగా నిర్వహిస్తున్నా.. పని చేయడం లేదని ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. వారి ప్రభుత్వంలో తాను ఉండడానికీ వీల్లేదనీ.. తీసేస్తామని బెదిరిస్తున్నారని వాపోయింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Last Updated : Jul 22, 2019, 12:07 PM IST

ABOUT THE AUTHOR

...view details