నెల్లూరు జిల్లా మహిమలూరులో ఉద్రిక్తత - land flattening in nellore district latest
నెల్లూరు జిల్లా మహిమలూరులో ప్రభుత్వ కాలనీ నిర్మాణానికి స్థలం సేకరించి చదును చేస్తుండగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు స్థలం చదును చేస్తుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు.

మహిమలూరులో స్థలం చదును చేసే కార్యక్రమం అడ్డగింత
మహిమలూరులో స్థలం చదును చేసే కార్యక్రమం అడ్డగింత
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరులో ప్రభుత్వ కాలనీల నిర్మాణం కోసం స్థలం చదును చేస్తున్న కార్యక్రమాన్ని గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్రామసచివాలయం వెనుక ప్రాంతంలో ఉన్న చెరువు సమీపంలో... దాదాపు 50 కుటుంబాల వారు పశువులు మేపుకుంటూ జీవిస్తున్నారు. పేదలకు జీవనాధారంగా ఉన్న ఆ స్థలంలో ఇళ్లు నిర్మించి తమ పొట్ట కొట్టొద్దని గ్రామస్థులు వేడుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ మధుసూదనరావు... గ్రామస్థుల సమస్యలు పరిష్కరిస్తామని, బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.