Buggana comments on Chandrababu: కర్నూలులో చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పందించారు. కర్నూలుకు కోర్టు వద్దని చెబుతున్న చంద్రబాబు.. రాయలసీమ వాసికాదా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రకు సచివాలయం వెళ్తే ఇబ్బంది ఏమిటి అని నిలదీశారు. ఒక్క ఏపీ మాత్రమే అప్పులు చేస్తోందా అని ప్రశ్నించారు. నేను అప్పుల మంత్రి అయితే.. యనమలను పెద్ద అప్పుల మంత్రి అనాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రం, దేశం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని.. వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. గోతులు పడకపోతే పోలవరం నిర్దేశిత గడువుకు పూర్తయ్యేదని స్పష్టం చేశారు.
Minister Buggana Review On Skill Hub And Colleges : సంక్రాంతి నాటికి రాష్ట్రంలో 176 స్కిల్హబ్ లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. విజయవాడలోని రాష్ట్ర ఆర్థిక సంస్థ కార్యాలయంలో స్కిల్‌హబ్‌లు, కాలేజీల పురోగతిపై మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 66 స్కిల్ హబ్‌లు ఏర్పాటు చేసి ప్రస్తుతం 2,400 మందికి శిక్షణ అందిస్తున్నామని.. మిగిలిన వాటిని సంక్రాంతి వరకు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.