ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీలో వైకాపా అంతరించబోతోంది: జడ శ్రావణ్​కుమార్​

Jada Shravan Kumar: రాష్ట్రంలో వైకాపా అంతరించిపోతుందని జడ శ్రావణ్​ కుమార్​ జోష్యం చెప్పారు. వైకాపా అప్రజాస్వామ్య దాడుల్ని తిప్పికొట్టేందుకు, ప్రజాస్వామ్య పరిరక్షణకు పిలుపునిచ్చిన తెలుగుదేశంతో చర్చిస్తే వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. అన్యాయాలపై పోరాటం చేస్తున్న జై భీమ్‌ భారత్ పార్టీని విమర్శించే నైతికత వైకాపా నేతలకు లేదని శ్రావణ్‌కుమార్‌ స్పష్టం చేశారు.

Jada Shravan Kumar
జడ శ్రావణ్ కుమార్ జోష్యం

By

Published : Oct 22, 2022, 6:23 PM IST

Jada Shravan Kumar: ఏపీలో వైకాపా కూడా అంతరించబోతోందని జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ జోష్యం చెప్పారు. తెదేపా అధినేత చంద్రబాబును తాను కలిస్తే కొంతమంది వక్రీకరణలు చేసి ప్రచారం చేస్తున్నారని, ప్రజా సమస్యల పరిష్కారంపై ఉమ్మడి పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దళితులకు అన్యాయం జరుగుతుంటే వైకాపాలో ఉన్న దళిత ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం రద్దు చేసిన పథకాలపై చర్చకు వచ్చే దమ్ము వైకాపా నేతలకు ఉందా అని ప్రశ్నించారు.

జడ శ్రావణ్ కుమార్ జోష్యం

"చంద్రబాబును కలిస్తే వక్రీకరణలు చేసి ప్రచారం చేస్తున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు కలిసి మాట్లాడటం తప్పు కాదు. ఎస్సీలకు అందుతున్న అనేక పథకాలు వైకాపా రద్దుచేసింది. పదోన్నతుల్లో రిజర్వేషన్లు నిలిపివేశారు. వివిధ కులాలకు పెట్టిన కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారు. రద్దుచేసిన పథకాలపై వైకాపా నేతలు చర్చకు వస్తారా?. ప్రభుత్వ అరాచకాలకు ప్రశ్నిస్తుంటే నాపై కేసులు పెడతారా?. రైతుల పాదయాత్రను అడ్డుకోవడం అప్రజాస్వామికం. జగన్ పాదయాత్ర చేస్తే ఎవరైనా అడ్డంకులు సృష్టించారా?. రాజకీయేతర ఐకాస ఏర్పాటుకు త్వరలోనే శ్రీకారం." -జడ శ్రావణ్‌కుమార్‌

ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు ప్రశ్నిస్తుంటే తనపై కేసులు పెడతున్నారని జడ శ్రావణ్​ కుమార్​ మండిపడ్డారు. జగన్​తో ఉంటేనే దళితులా? మిగిలిన పార్టీల్లో ఉన్నవారు దళితులు కాదా అని అడిగారు. జగన్ ఇప్పుడు గుళ్లకు వెళ్తున్నారని.. విజయమ్మ, షర్మిల, అనిల్ బైబిల్ పట్టుకుని తిరుగుతున్నారని, వైకాపానే కుల, మత రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.

అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోవడం అప్రజాస్వామికమని జడ శ్రావణ్​ కుమార్​ అన్నారు. రాష్ట్రంలో ఒక నాన్ పొలిటికల్ ఐకాసను ఏర్పాటు చేయాలని చంద్రబాబుకి సూచించాన్నారు. ఏపీలో మహిళా కమిషన్.. వైకాపా కమిషన్​గా మారిపోయిందన్నారు. పవన్ కల్యాణ్​కి మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details