ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 7PM

.

AP TOP NEWS
AP TOP NEWS

By

Published : Nov 2, 2022, 7:01 PM IST

  • విద్యుత్​ ఛార్జీలు పెంపుపై ఉన్న శ్రద్ధ.. ప్రజల ప్రాణాలను రక్షించడంపై లేదు: తెదేపా
    రాష్ట్రంలో విద్యుత్​ ప్రమాదాలు తరచూ జరుగుతున్న ప్రభుత్వం చోద్యం చూస్తుందని తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో జరిగిన ప్రమాదంపై స్పందించిన నాయకులు.. ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని డిమాండ్​ చేశారు. మరణించిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్​ చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి
  • మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్‌పై సైబర్​క్రైమ్​లో ఫిర్యాదు.. ఎందుకంటే?
    దేవుని మంత్రాన్ని ఓ ఐటెం సాంగ్​లో వాడారంటూ ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్​పై హైదరాబాద్​ సైబర్​ క్రైమ్​లో ఫిర్యాదు నమోదైంది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా పాటను రూపొందించారని.. వెంటనే దేవీశ్రీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు.
    పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మహిళ ఆత్మహత్యాయత్నం ఘటనపై మంత్రి దాడిశెట్టి రాజా ఏమన్నారంటే..!
    తాడేపల్లిలోని సీఎం జగన్‌ కార్యాలయం సమీపంలో ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించిన ఘటనపై మంత్రి దాడిశెట్టి రాజా స్పందించారు. జరిగిన ఘటనతో తనకు సంబందం లేదని తెలిపారు. తన వద్ద పని చేసే గన్​మెన్​ను గతంలోనే తప్పించినట్లు పేర్కొన్నారు. తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని వెల్లడించారు. మహిళకు నిజంగా అన్యాయం జరిగి ఉంటే ప్రభుత్వం కచ్చితంగా ఆదుకుంటుందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అమరావతి రాజధానికి బెజవాడ బార్ అసోసియేషన్ మద్దతు
    అమరావతి రాజధానికి మద్దతుగా విజయవాడలో న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయస్ధానం వద్ద నుంచి జలవనరుల శాఖ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. రైతులు చేస్తున్న పోరాటంలో న్యాయం, ధర్మం ఉన్నాయని.. పాదయాత్రకు రాజకీయాలు ఆపాదించి అడ్డుకోవడం దుర్మార్గమని న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మోర్బీ వంతెన ఘటన 'యాక్ట్ ఆఫ్ గాడ్'.. కోర్టులో 'ఒరేవా' మేనేజర్ వాదనలు
    మోర్బీ వంతెన కూలిన ఘటన.. యాక్ట్ ఆఫ్ గాడ్ అని ఒరేవా కంపెనీ మేనేజర్ వాదించారు. ఈ విషయాన్ని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్.. కోర్టుకు తెలిపారు. వంతెన తీగలు తుప్పుబట్టిపోయాయని, ప్రజల సందర్శనకు బ్రిడ్జి సిద్ధంగానే లేదని న్యాయవాది పేర్కొన్నారు. బ్రిడ్జి మరమ్మతుల కోసం టెండరు కూడా పిలవలేదని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కరెంట్ వైర్లలో చిక్కుకున్న కారు తాళం తీస్తూ ఒకరు మృతి
    కరెంట్ షాక్ తగిలి మల్లప్ప అనే వ్యక్తి మృతి చెందిన ఘటన కర్ణాటకలోని హాసన్ జిల్లాలో జరిగింది. ఇంటి ముందున్న కరెంట్ వైర్లలో చిక్కుకున్న కారు తాళాన్ని తీసే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది. తాళాన్ని ఇల్లు తుడిచే కర్రతో తీయబోయిన మల్లప్ప షాక్​తో అక్కడికక్కడే మరణించాడు. ఉదయగిరి లేఅవుట్​లో నివాసం ఉంటున్న మల్లప్ప స్టాఫ్​ నర్స్​గా పనిచేస్తున్నాడు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఆమె కాళ్లు విరగ్గొట్టాలనుకున్నా'.. అమెరికా స్పీకర్ కిడ్నాప్​నకు యత్నం!
    పెలోసీని అపహరించేందుకే గత వారం ఆమె ఇంటిపై దాడి జరిగినట్లు అమెరికా జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ అనుమానిస్తోంది. ఈ మేరకు ఓ వ్యక్తిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తోంది. అయితే ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగిన దాడిగా అభిప్రాయపడ్డారు స్పీకర్‌ నాన్సీ పెలోసీ. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. విజయవాడ, హైదరాబాద్​లో ఇలా..!
    Gold Price Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • T20 World Cup: కీలక పోరులో టీమ్​ఇండియా విజయం.. సెమీస్​ అవకాశాలు​ సజీవం
    టీ20 ప్రపంచకప్​లో భాగంగా బంగ్లాదేశ్​తో జరిగిన కీలక మ్యాచ్​లో టీమ్​ఇండియా విజయం సాధించింది. ఈ విజయంతో సెమీఫైనల్​ ఆశల్ని సజీవం చేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆ క్యాబ్​ డ్రైవర్​తో 'జాతి రత్నాలు' బ్యూటీ ఫరియా లవ్​ స్టోరీ!
    'జాతి రత్నాలు' చిత్రంతో హీరోయిన్​గా పరిచయమైన తెలుగు అందం ఫరియా అబ్దుల్లా. అందం, అభినయంతో మాత్రమే కాదు.. కామెడీ టైమింగ్​తో ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తోంది ఈ భామ. ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా'కు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి క్యాబ్​ డ్రైవర్​తో ప్రేమ కథ, సూపర్‌ మార్కెట్లో చోరీ వంటి ఆసక్తికర సంఘటనలను పంచుకుంది. అవి ఆమె మాటల్లోనే..పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details