కన్నుల పండువగా వేంకటేశ్వరుని తెప్పోత్సవం - నంద్యాలలో వేంకటేశ్వరుని తెప్పోత్సవం వార్తలు
కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని చిన్నచెరువులో శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి తెప్పోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక సంజీవనగర్లో వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి ఆలయ ఉత్సవమూర్తులను తెప్పలో ఉంచి విహరింపజేశారు. ఈ వేడుకను తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.