కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న కర్నూలు జిల్లాలో లాక్డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో తిండి లేక ఇబ్బందులు పడుతున్న వారికి మనవతావాదులు సాయం చేస్తున్నారు. నంద్యాలలోని హరిజనవాడలో 1500 కుటుంబాలకు ఎస్వీఆర్ఎస్డీఆర్ ప్రైవేటు కళాశాల యాజమాన్యం కూరగాయలను అందించింది. జిల్లాలో కరోనా కేసులు పెరగడం బాధాకరమని దాతలన్నారు.
నంద్యాలలో కూరగాయలు పంపిణీ చేసిన విద్యార్థులు
కరోనా కారణంగా కొనసాగుతున్న లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలను పలువురు ఆదుకుంటున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల హరిజనవాడలో 1500 కుటుంబాలకు ఉచితంగా కూరగాయలు పంపిణీ చేశారు.
నంద్యాలలో కూరగాయలు పంపిణీ చేసిన విద్యార్థులు