'మల్లన్న'కు పట్టువస్త్రాలు - KURNOOL
శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మూడో రోజుకు చేరుకున్న సందర్భంగా... తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మల్లన్నకు పట్టువస్త్రాలు సమర్పించారు.
శ్రీశైల మల్లన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్
శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మూడో రోజుకు చేరుకున్నాయి. మంగళవాయిద్యాల నడుమ తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పట్టు వస్త్రాలను స్వామి, అమ్మవార్లకు సమర్పించారు. దేవస్థానం ఈవో శ్రీరామచంద్రమూర్తి, ఆలయ అర్చకులు, వేదపండితులు పట్టు వస్త్రాలకు పూజలు నిర్వహించారు.