ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నంద్యాలను మరో కర్నూలు చేయొద్దు' - bhuma bramhanandhareddy latest vedio

నంద్యాలను మరో కర్నూలు చేయొద్దని తెదేపా నేత భూమా బ్రహ్మానందరెడ్డి హితవు పలికారు. రెండురోజుల క్రితం ప్రభుత్వాసుపత్రిలో మృతిచెందిన వ్యక్తిని అర్ధరాత్రి సమయంలో అధికారులు ఎందుకు దహనం చేయించారని ఆయన నిలదీశారు.

'నంద్యాలను మరో కర్నూలు చేయొద్దు'
'నంద్యాలను మరో కర్నూలు చేయొద్దు'

By

Published : Apr 24, 2020, 6:45 AM IST

'నంద్యాలను మరో కర్నూలు చేయొద్దు'

కర్నూలులో చేసిన తప్పును నంద్యాలలో చేయొద్దని తెదేపా నేత భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు. నంద్యాలలో అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో కరోనా మరణాన్ని అధికారులు దాచిపెట్టారని ఆయన ఆరోపించారు. రెండురోజుల క్రితం ప్రభుత్వాసుపత్రిలో మృతిచెందిన వ్యక్తిని అర్ధరాత్రి సమయంలో అధికారులు ఎందుకు దహనం చేయించారని నిలదీశారు. కర్నూలులో చేసిన తప్పును అధికారులు నంద్యాలలో చేస్తున్నారని బ్రహ్మానందరెడ్డి మండిపడ్డారు. మృతిచెందిన వ్యక్తికి వైద్యం చేసిన ప్రముఖ వైద్యుడిని ఎందుకు క్వారంటైన్​కు తరలించలేదని ప్రశ్నించారు.

ఇదీ చూడండి:రెడ్ జోన్ ప్రాంతాల్లో డ్రోన్లతో రసాయనాల పిచికారీ

ABOUT THE AUTHOR

...view details