అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ, రాష్ట్ర చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల దేవి, తెదేపా నాయకులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కృష్ణా జిల్లా విజయవాడలో ఆంధ్ర రత్న పార్క్ వద్ద వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం వల్లే రాష్ట్ర సాధన సాధ్యమైందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి అన్నారు.
ఆంధ్రరాష్ట్రం కోసం 58 రోజులు నిరాహారదీక్ష చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని విజయనగరం జిల్లా కలెక్టరేట్ సమావేశ భవనంలో ఘనంగా జరిపారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ డా. హరి జవహర్లాల్ పాల్గొన్నారు.