కర్నూలు జిల్లా మిడుతూరు మండలం కడుమూరు గ్రామంలో వృద్ధురాలి అంత్యక్రియలకు కొందరు అభ్యంతరం చెప్పారు. వృద్ధురాలి కుమారుడికి తమ కుల సంఘంలో సభ్యత్వం లేదన్న కారణంతో శ్మశాన వాటికలో అంత్యక్రియలకు అభ్యంతరం చెప్పారు గ్రామంలో వృద్ధురాలు అనసూయమ్మ (70) గురువారం చనిపోయారు. ఆమె కుమారుడు శ్రీనివాసులు అలియాస్ వాడాల శీను తల్లి మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. ఆమె అంత్యక్రియలకు సొంత సామాజికవర్గానికి చెందినవారే కొందరు అభ్యంతరం చెప్పారు. కుల సంఘానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావని, సంఘంలో సభ్యత్వం లేదంటూ శ్రీనును నిలదీశారు.
Cremation Problem: కుల సంఘంలో సభ్యత్వం లేదని.. అంత్యక్రియలను అడ్డుకుని.. - ap latest news
woman cremation stopped people: వృద్ధురాలు చనిపోతే తమ కుల సంఘంలో ఆమె కుమారుడికి సభ్యత్వం లేదన్న కారణంతో శ్మశాన వాటికలో అంత్యక్రియలకు అభ్యంతరం చెప్పారు కొందరు. కర్నూలు జిల్లా మిడుతూరు మండలం కడుమూరు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

old women cremation stopped at kurnool
బాధితుడు ఎస్సై మారుతీ శంకర్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఆయన తహసీల్దారు సిరాజుద్దీన్‌తో కలిసి గ్రామానికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పారు. చివరకు కులపెద్దలు రాజీ చేయడంతో సమస్య సద్దుమణిగింది. మృతదేహాన్ని పూడ్చడానికి ఒప్పుకున్నారు. వాడాల శ్రీను ఫిర్యాదు మేరకు అంత్యక్రియలను అడ్డుకున్న వారిపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.
ఇదీ చదవండి: