ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దుష్ప్రచారంపై ఆవేదనతో.. కుమార్తెలతో కలిసి విషం తాగిన తల్లి

కర్నూలు జిల్లా నంద్యాల - గిద్దలూరు రహదారిపై.. ఓ తల్లి, తన ఇద్దరు కుమార్తెలకు విషమిచ్చి తాను సైతం విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు వారిని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొందరు బంధువులు.. తన నడవడికపై దుష్ప్రచారం చేస్తున్నారని.. అందుకు మనస్థాపం చెంది ఆత్మహత్యకు యత్నించానట్లు.. బాధితురాలు ఆదిలక్ష్మి తెలిపింది.

suicide attempt
కూతుళ్లకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం

By

Published : Apr 10, 2021, 12:42 PM IST

ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. తాను సైతం విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన.. కర్నూలు జిల్లా నంద్యాల - గిద్దలూరు రహదారిపై సర్వ నరసింహ స్వామి ఆలయ సమీపంలో జరిగింది. దిశ యాప్ ద్వారా సమాచారం అందుకున్న మహానంది పోలీసులు.. అక్కడికి చేరుకుని వారిని నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

నంద్యాల మండలం చాపిరేవుల గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి అనే మహిళ.. తన ఇద్దరు కుమార్తెలు సుప్రియ (8), చరిత (5) కు విషం తాగించింది. తర్వాత తానూ విషం తాగి బలవన్మరణానికి యత్నించింది. కొందరు బంధువులు తన నడవడికపై దుష్ప్రచారం చేస్తున్నారని.. అందుకే మనస్థాపం చెంది ఆత్మహత్యకు యత్నించానట్లు ఆదిలక్ష్మి తెలిపింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details