కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం కంబలదిన్నెలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన సరోజ ఉదయం పొలానికి వెళ్లి పురుగుల మందు తాగింది. గమనించిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించగా... అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. అయితే ఆమెకు తరచూ కడుపునొప్పి వస్తుందని.. దాని వల్లే బలవన్మరణానికి పాల్పడినట్లు బంధువులు తెలిపారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివాహిత ఆత్మహత్య.. కడుపు నొప్పే కారణమా..? - women suicide news in kurnool
పెళ్లయిన ఆర్నెళ్లకే ఓ వివాహిత తనువు చాలించింది. పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. కర్నూలు జిల్లా కంబలదిన్నెలో జరిగిన ఘటన వివరాలివి.

వివాహిత ఆత్మహత్య