ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పుష్కర ఘాట్ల పనులపై కలెక్టర్‌ అసంతృప్తి - కర్నూలులో తుంగభద్ర పుష్కరాలపై తాజా వార్తలు

తుంగభద్ర పుష్కరాలకు ఘాట్ల పనులపై కలెక్టర్ వీరపాండియన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు అరకొరగా చేయడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో భక్తులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.

karnool district collector observed tungabadhara pushkara works
పుష్కర పనులు పరిశీలించిన కలెక్టర్ వీరపాండియన్

By

Published : Nov 17, 2020, 10:25 AM IST

కర్నూలు జిల్లాలో జరిగే తుంగభద్ర పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. జిల్లాలోని పలు ఘాట్లను కలెక్టర్ పరిశీలించారు. ఈనెల 20 నుంచి జరిగే పుష్కరాలకు 21 పుష్కర ఘాట్లు సహా భక్తులకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. నాగలదిన్నె, గురజాల గ్రామాల్లో పుష్కర పనితీరుపై పర్యటించారు. నాగలదిన్నె పుష్కర ఘాట్​ పనులపై కలెక్టర్‌ వీరపాండియన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు అరకొరగా చేయడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం గురజాల రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని, పనులను పరిశీలించారు.

కొవిడ్ కారణంగా పుణ్యస్నానాలు నిషేధించినందున.. భక్తులు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. త్వరలోనే వెబ్ సైట్ ను అందుబాటులో ఉంచుతామని.. పుష్కరాలకు వచ్చే భక్తులు ఈ- టికెట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details