ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యూరియా కోసం ఆదోనిలో రైతుల ఆందోళన - యూరియా కోసం ఆదోనిలో రైతులు ధర్నా

కర్నూలు జిల్లా ఆదోనిలో రైతులు యూరియా కోసం ధర్నాకు దిగారు. కేడీసీఏంఎస్ గోదాం వద్ద ఆందోళన చేశారు. పది రోజుల నుంచి ఆర్బీకే చుట్టూ తిరుగుతున్నా యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

యూరియా కోసం ఆదోనిలో రైతుల ఆందోళన
యూరియా కోసం ఆదోనిలో రైతుల ఆందోళన

By

Published : Aug 19, 2020, 10:07 PM IST

కర్నూలు జిల్లా ఆదోనిలో రైతులు యూరియా కోసం ఆందోళనకు దిగారు. డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో కేడీసీఏంఎస్ గోదాం వద్ద రైతులు ధర్నా చేశారు. రైతు సంఘం నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. సకాలంలో రైతులకు యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని నాయకులు ఆరోపించారు. రైతులు పది రోజుల నుంచి రైతు భరోసా కేంద్రాల చుట్టూ తిరిగినా యూరియా దొరకలేదన్నారు. చివరకు కేడీసీఏంఎస్ గోదాం వద్ద కూడా యూరియా దొరకపోయేసరికి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే స్థానిక ఎమ్మెల్యే కనీసం పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన చెందారు. వ్యవసాయ అధికారి పాపిరెడ్డి ధర్నా స్థలానికి వచ్చి... రేపటి నుంచి యూరియా సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.

ఇదీ చదవండి :ఆర్టీసీ కార్మికులకు రూ.50 లక్షల కరోనా బీమా

ABOUT THE AUTHOR

...view details