ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 22, 2020, 12:42 PM IST

ETV Bharat / state

వడగళ్ల వర్షం...మిగిల్చిన నష్టం..!

రైతు పై ప్రకృతి కన్నెర్ర చేసింది. ఒక్క వడగళ్ల వానతోనే రైతన్నకు అపార నష్టం కలిగించింది. ఇప్పటికే పెరిగిన పెట్టుబడులకు అనుగుణంగా గిట్టుబాటు ధరలు రావడం లేదనే దిగాలుకు తోడు ఊహించని విపత్తు సృష్టించిన వ్యధ కోలుకోకుండా చేసింది. శనివారం కాసేపు కురిసిన వర్షానికి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సబ్ డివిజన్​లోనే వెయ్యి హెక్టార్లకు పైగా పంట దెబ్బతింది.

Extreme damage to the farmer with rain
వడగళ్ల వర్షం...మిగిల్చిన నష్టం

వడగళ్ల వర్షం...మిగిల్చిన నష్టం

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పరిధిలో ఆళ్లగడ్డ, రుద్రవరం మండలాల్లో కురిసిన వడగళ్ల వర్షం రైతుకు కడగళ్లు మిగిల్చింది. అరగంటపాటు కురిసిన ఈ వడగళ్ల వర్షం దెబ్బకు వెయ్యి హెక్టార్లకు పైగా నష్టం వాటిల్లింది. వడగళ్ళు నేరుగా పంట పై పడటంతో మొక్కలు కాండాల వద్దకు విరిగిపోయాయి. మొక్కజొన్న, వరి, పెసర, నువ్వుల పంటలు ఈ ప్రకృతి ప్రకోపానికి గురయ్యాయి. మరో రెండు వారాల్లో పంట చేతికి వస్తుందనుకున్న రైతన్నకు కన్నీటిని మిగిల్చాయి. పంట నష్టం జరిగిన ప్రాంతాలలో తెదేపా నేత మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పర్యటించి..రైతులను ఓదార్చారు. బాధితులను ఆదుకునేందుకు పంట నష్టాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. మరోవైపు స్థానిక వైకాపా ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి సతీమణి సారిక రెడ్డి కూడా పంటనష్టం ప్రాంతాల్లో పర్య టించి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details