కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని వివిధ కార్మిక సంఘాలు కర్నూల్లో ధర్నా నిర్వహించారు. నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం అడుగులు వేస్తోందని ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మిక చట్టాల సవరణను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించాలని ప్రభుత్వానికి వారు డిమాండ్ చేశారు. కార్మిక చట్టాల విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మిక చట్టాల సవరణపై కార్మిక సంఘాల ధర్నా
కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాస్తుందని కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం ప్యక్తం చేశారు. కర్నూలులో భారీ ధర్నా నిర్వహించారు. కార్మిక చట్టాల సవరణను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్రానికి కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.
కార్మిక చట్టాల సవరణను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి