కర్నూలు జిల్లా నంద్యాలలో డ్రోన్లతో రసాయన ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. పట్టణంలోని రెడ్ జోన్ ప్రాంతాల్లో వీటిని చల్లుతున్నారు. ఈ కార్యక్రమాన్ని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు. వైరస్ వ్యాప్తి నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. రోడ్లపై అనవసరంగా తిరిగే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రెడ్ జోన్ ప్రాంతాల్లో డ్రోన్లతో రసాయనాల పిచికారీ - డ్రోన్ల ద్వారా నంద్యాలలో రసాయన ద్రావణం పిచికారీ
కరోనా నేపథ్యంలో ఇళ్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రజలను కోరారు. పట్టణంలోని రెడ్ జోన్ ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.

డ్రోన్ల ద్వారా నంద్యాలలో రసాయన ద్రావణం పిచికారీ