ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మొక్కలు నాటుతుండగా బయటపడ్డాయి.. అంతా షాక్...! - kurnool district latest news

కర్నూలు జిల్లా గాజులపల్లిలో పురాతన వస్తువులు లభ్యమయ్యాయి. మొక్కలు నాటేందుకు గుంత తవ్వుతుండగా కత్తి, గుర్రం, హస్తం బయటపడ్డాయి. సమాచారం అందుకున్న అధికారులు.. గాజులపల్లికి చేరుకుని విచారణ చేపట్టారు.

గాజులపల్లిలో పురాతన వస్తువులు లభ్యం
గాజులపల్లిలో పురాతన వస్తువులు లభ్యం

By

Published : Aug 15, 2021, 8:17 PM IST

కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లి గ్రామంలో పురాతన వస్తువులు బయటపడ్డాయి. గ్రామానికి చెందిన కరీం బాషా అనే వ్యక్తి.. మొక్కలు నాటేందుకు గుంత తవ్వుతుండగా కత్తి, హస్తం, గుర్రం వస్తువులు లభ్యమయ్యాయి. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆ వస్తువులను చూసేందుకు తరలివచ్చారు.

మహానంది ఇంఛార్జి తహశీల్దార్ నారాయణ రెడ్డి, గ్రామీణ పోలీసు స్టేషన్ సీఐ రవీంద్ర.. సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మొహరం పర్వదినం సమీపిస్తున్న తరుణంలో.. ఈ వస్తువులు లభించడం ప్రత్యేకత సంతరించుకుంది.

ABOUT THE AUTHOR

...view details