ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాక్‌డౌన్ వల్ల ఇంటికి వెళ్లలేక హైదరాబాద్​లో యువతి ఆత్మహత్య

లాక్‌డౌన్ కారణంగా ఇంటికి వెళ్లలేని ఓ యువతి మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని మణికొండ పరిధిలో చోటు చేసుకుంది.

లాక్‌డౌన్ వల్ల ఇంటికి వెళ్లలేక యువతి ఆత్మహత్య
లాక్‌డౌన్ వల్ల ఇంటికి వెళ్లలేక యువతి ఆత్మహత్య

By

Published : May 13, 2020, 2:23 PM IST

హైదరాబాద్​ మణికొండలో విషాదం చోటు చేసుకుంది. ఓ యువతి ల్యాంకో హిల్స్​ భవనంలోని 15 అంతస్తు ఎక్కి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు కృష్ణాజిల్లా నందిగామ మండలం కమ్మవారిపాలెంకు చెందిన వీరవల్లిక(20). ల్యాంకోహిల్స్​లోని ఓ సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని నివాసంలో పని చేస్తోంది. తల్లిదండ్రులకు ఫోన్​ చేసి వస్తున్నానని తెలిపింది. లాక్​డౌన్​ వల్ల వాహనాలు నడవడం లేదని... తర్వాత రావాలని తల్లిదండ్రులు చెప్పారు. ఇంటికి వెళ్లలేక తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది. వీరవల్లిక మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details