కృష్ణా జిల్లా వెంకటనరసింహపురం గ్రామంలో నీటి ఎద్దడి ఏర్పడింది. కుళాయిల్లో నీరు రాక స్థానికులు దాహార్తితో అలమటిస్తున్నారు. రెండువేలకుపైగా జనాభా ఉండే గ్రామంలో ట్యాంక్ సామర్థ్యం ఉన్నప్పటికీ.. అందులో నీటి లభ్యత తక్కువగా ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ అధికారులు వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసినప్పటికీ తమకు సరిపోవడం లేదని వాపోతున్నారు. ఒక్కో ట్యాంకర్‌కు రూ.500 చెల్లించి నీటిని కొనుగోలు చేస్తున్నామంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
తాగునీటికి పాట్లు... ప్రజలకు ఇక్కట్లు
కృష్ణా జిల్లా వెంకటనరసింహపురం గ్రామంలో నీటి కొరత ఏర్పడింది. రెండువేలకు పైగా జనాభా ఉన్న ఈ గ్రామంలో పంచాయతీ అధికారులు సరఫరా చేస్తున్న నీరు ఏమాత్రం సరిపోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వెంకటనరసింహపురంలో నీటి ఎద్దడి