ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంటింటికీ వ్యాక్సిన్ వేసే బాధ్యత సర్కార్ దే : గోరంట్ల - Gorantla Bucchayya Chowdary Telugu Desham News Today

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని శిక్షణ కళాశాలలో ప్రజలు కొవిడ్ వ్యాక్సిన్ కోసం గుమిగూడటంపై తెదేపా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్విట్టర్​లో వెల్లడించారు. కరోనా విజృంభణను కట్టిడి చేయాలంటే ప్రభుత్వమే ఇంటింటికీ వ్యాక్సిన్ అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇంటింటికీ వ్యాక్సిన్ వేసే బాధ్యత సర్కార్ దే : గోరంట్ల
ఇంటింటికీ వ్యాక్సిన్ వేసే బాధ్యత సర్కార్ దే : గోరంట్ల

By

Published : May 6, 2021, 11:27 AM IST

రాష్ట్రంలో ఇంటింటికీ స్వయంగా వ్యాక్సిన్ వేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు.

భయాందోళనలతో గుంపులు..

వ్యాక్సినేషన్ ఇక ఉండదేమో అనే భయాందోళనలతో ప్రజలు టీకా కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున్న గుమిగూడుతున్న ఓ వీడియోను తన ట్విట్టర్​కు జత చేశారు. వ్యాక్సిన్ విషయం దేవుడెరుగు కానీ రాజమండ్రి ట్రైనింగ్ కళాశాలలో మాత్రం ఈ దృశ్యం కొవిడ్ విజృంభణకు పరాకాష్టగా మారిందని బుచ్చయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి :'ఆంధ్రప్రదేశ్ రకం వైరస్​ బలహీనమైనదే'

ABOUT THE AUTHOR

...view details