రాష్ట్రంలోని వివిధ సంక్షేమ పథకాలకు పేర్లను మార్పుచేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రన్న పెళ్లికానుక పథకాన్ని... వైఎస్ఆర్ పెళ్లికానుకగా మారుస్తూ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఉత్తర్వులు ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల యువతీ యువకుల వివాహానికి ప్రభుత్వ ప్రోత్సాహంగా ఇచ్చే పెళ్లికానుక పేరును మార్పు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా అన్న అభయహస్తం పథకం పేరును వైఎస్ఆర్ అభయహస్తంగా మారుస్తూ ఉత్తర్వులు వెలువరించారు.
రాష్ట్రంలో మరో రెండు పథకాలకు పేర్లు మార్పు
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పథకాల పేర్లలో మార్పులు చేస్తోంది. అదే బాటలో తాజాగా మరో రెండు సంక్షేమ పథకాలకు పేర్లను మార్పు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
the government has changed names for various welfare programs in andhrapradesh