ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జూదాన్ని రాష్ట్ర క్రీడగా మార్చారు' - ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి

వైకాపా ఎమ్మెల్యేలు రాష్ట్రంలో యథేచ్ఛగా జూదాన్ని నిర్వహిస్తూ పేదల కష్టాన్ని దోచుకుంటున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి ధ్వజమెత్తారు.

tdp leader gummadi sandhyarani comments on mla undavalli sridevi
తెదేపా పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి

By

Published : Nov 8, 2020, 11:34 AM IST

పేకాట క్లబ్​లు, గుండాట శిబిరాలతో.. వైకాపా నేతలు జూదాన్ని రాష్ట్ర క్రీడగా మార్చారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి మండిపడ్డారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పేకాట క్లబ్బుల నిర్వహణ పై ముఖ్యమంత్రి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అభివృద్ధిలో పోటీపడాల్సిన వారు అవినీతిలో పోటీపడటం బాధాకారమన్నారు. తెదేపా హయాంలో కాలనీకో అన్నా క్యాంటీన్ పెట్టి పేదలకడుపు నింపితే, వైకాపా పేటకొక పేకాటక్లబ్బు ఏర్పాటు చేసి పేదలను దోచుకుంటున్నారని అన్నారు. సీఎం ఇలాఖాలో కూడా పేకాట, గుండాట నిర్వహిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. తమ అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతూ సామాన్య ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details