ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం జగన్​ను కలిసిన శృంగేరి శారదా పీఠం ప్రతినిధులు - కుమారస్వామి ఆలయ ప్రాజెక్ట్‌

ప్రముఖ ఆధ్యాత్మిక శైవ క్షేత్రం శ్రీశైలంలో కుమార విహారం పేరుతో నిర్మించిన కుమారస్వామి ఆలయ ప్రాజెక్ట్‌ ఆవిష్కరణకు సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి రావాలని సీఎం వైఎస్‌ జగన్​ను శృంగేరి శారదాపీఠం ప్రతినిధులు ఆహ్వానించారు.

Srungeri Saradapeetam representatives  met the CM
సీఎంను కలిసిన శృంగేరి శారదాపీఠం ప్రతినిధులు

By

Published : Sep 11, 2020, 2:50 PM IST

ప్రముఖ ఆధ్యాత్మిక శైవ క్షేత్రం శ్రీశైలంలో కుమార విహారం పేరుతో నిర్మించనున్న కుమారస్వామి ఆలయ ప్రాజెక్ట్‌ ఆవిష్కరణకు సిద్ధమైంది. కార్యక్రమానికి రావాలని సీఎం వైఎస్‌ జగన్​ను శృంగేరి శారదాపీఠం ప్రతినిధులు ఆహ్వానించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన శృంగేరి శారదాపీఠం ప్రతినిధులు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ప్రాజెక్ట్‌ వివరాలు వెల్లడించారు. కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. శృంగేరి శారదా పీఠాధిపతి శ్రీ భారతీ తీర్ధస్వామి వారి దివ్య ఆశీస్సులతో, సూచనలతో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టినట్లు సీఎంకి ప్రతినిధులు వివరించారు.

శృంగేరి శారదాపీఠం ఆధ్వర్యంలో నిర్మించనున్న కుమార విహారం ప్రాజెక్ట్‌లో భాగంగా 16 ఎకరాల విస్తీర్ణంలో కుమారస్వామి దేవాలయం నిర్మించనున్నారు . 2022 డిసెంబర్‌ నాటికి ఈ ప్రాజెక్ట్‌ పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఆధ్యాత్మిక, భక్తి భావం ప్రజల్లో పెంపొందినప్పుడే మానసిక ప్రశాంతతతో కూడిన జీవనం సాధ్యమవుతుందని సీఎం జగన్‌ అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి.హిందూ మతంపై పథకం ప్రకారం దాడులు చేస్తున్నారు: ఎంపీ కనకమేడల

ABOUT THE AUTHOR

...view details