కృష్ణా జిల్లాలోని గుడివాడ డివిజన్ పరిధిలోని తొమ్మిది మండలాల్లో రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. రెండో రోజు 214 మంది సర్పంచి స్థానాలకు, 952 మంది వార్డులకు నామినేషన్లు దాఖలు చేశారు. తొలి రోజు కంటే నామినేషన్లు పెరిగాయి. రెండు రోజుల్లో కలిపి తొమ్మిది మండలాల్లో 389 మంది సర్పంచి స్థానాలకు, 1323 మంది వార్డులకు నామినేషన్లు వేశారు.
* గుడివాడ రూరల్: రెండో రోజు 16 గ్రామాల్లో 14 మంది సర్పంచి స్థానాలకు, 46 మంది వార్డులకు నామినేషన్లు వేశారు. మొత్తంగా రెండు రోజుల్లో 19 మంది సర్పంచులకు నామినేషన్లు వేశారు. 54 మంది వార్డులకు దాఖలు చేశారు.
* పెదపారుపూడి: రెండో రోజు ఎనిమిది గ్రామాల్లో 13 మంది సర్పంచులకు, 54 మంది వార్డులకు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం కలిపి రెండు రోజుల్లో 22 మంది సర్పంచి స్థానాలకు, 84 మంది వార్డులకు ఇప్పటివరకు నామినేషన్లు వేశారు.
* నందివాడ రూరల్: 14 గ్రామాల్లో 33 మంది సర్పంచి స్థానాలకు, 127 మంది వార్డులకు నామినేషన్లు వేశారు. రెండు రోజులు కలిపి 50 మంది సర్పంచి స్థానాలకు, 142 మంది వార్డులకు నామినేషన్లు వేశారు.
* గుడ్లవల్లేరు: రెండో రోజు సర్పంచి స్థానాలకు ఎనిమిది గ్రామాల్లో 15 మంది, వార్డులకు 97 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తంగా రెండు రోజుల్లో సర్పంచులకు 35 మంది, వార్డులకు 138 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
* పామర్రు: 15 గ్రామాల్లో 29 మంది సర్పంచి స్థానాలకు, 88 మంది వార్డులకు నామినేషన్లు వేశారు. రెండు రోజులు కలిపి సర్పంచులకు 36, వార్డులకు 109 మంది నామినేషన్లు వేశారు.