మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ యనమలకుదురు ప్రసిద్ద శివాలయంలో ప్రభల ఉత్సవం వైభవంగా జరిగింది. శివరాత్రి జాగరణ సమయంలో రాత్రంతా ప్రభల ఊరేగింపు ఆనవాయితీగా వస్తోంది. వెదురుతో ప్రత్యేకంగా తయారు చేసిన ప్రభలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. పూజలు చేసిన అనంతరం మేళ తాళాలతో ప్రభలను యనమలకుదురు గ్రామం వీధుల మీదుగా ఊరేగించారు. భారీగా భక్తులు తరలివచ్చారు.
యనమలకుదురు శివాలయంలో వైభవంగా ప్రభల ఉత్సవం - krishna district latest updates
విజయవాడ సమీపాన ఉన్న యనమలకుదురు శివాలయంలో ప్రభల ఉత్సవం వైభవంగా జరిగింది. ప్రభలను చూసేందుకు భక్తజన సందోహం ఆలయానికి తరలివచ్చారు. ప్రత్యేక పూజల అనంతరం ప్రభలను ఊరేగిస్తారు.

యనమలకుదురు శివాలయంలో వైభవంగా ప్రభల ఉత్సవం