ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నంది విగ్రహం ధ్వంసం.. పోలీసులు సీరియస్ - krishna district police latest news

వత్సవాయి మండలం మక్కపేట కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన నంది విగ్రహం ధ్వంసం కేసును పోలీసులు తీవ్రంగా పరిగణించారు. మూడు బృందాలుగా ఏర్పడి... వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Police serious on Nandi statue Damage
నంది విగ్రహం ధ్వంసం.. పోలీసులు సీరియస్

By

Published : Sep 17, 2020, 10:09 PM IST

కృష్ణా జిల్లా వత్సవాయి మండలం మక్కపేట కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన నంది విగ్రహం ధ్వంసం కేసును జిల్లా పోలీసులు సీరియస్​గా తీసుకున్నారు. ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు.. మూడు ప్రత్యేక బృందాలు విచారణ చేపట్టాయి. జగ్గయ్యపేట సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో స్థానిక పోలీసులతో ఒక బృందం... క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రెండో బృందంగా, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మరో బృందంగా ఏర్పడి విచారణ మొదలుపెట్టారు. గతంలో వివిధ దేవాలయాల్లో చోరీ చేసిన నిందితులను ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సీఐ తెలిపారు. ఈ సంఘటన ఎవరైనా ఆకతాయిగా చేసిందా..? మరే ఇతర కారణాల వల్ల చేశారా..? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details