అరుదైన వ్యాధి బ్రెయిన్ సిండ్రోమ్‌తో నెలరోజులుగా కోమాలో ఉన్న శిశువుకు దీవెన ఫౌండేషన్ ద్వారా వన్ టౌన్ పీఎస్ కానిస్టేబుల్ ఆర్ధిక సహాయం అందించారు. విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన చిన్నారి.. కొంతకాలంగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఈ విషయం తెలుసుకున్న వన్‌టౌన్ కానిస్టేబుల్ నాగరాజు.. దీవెన ఫౌండేషన్ ద్వారా రూ.25 వేలు ఆర్థిక సహాయాన్ని బాలిక తల్లిదండ్రులకు అందజేశారు.
కానిస్టేబుల్ ఔదార్యం... చిన్నారి వైద్యానికి ఆర్థిక సహాయం - విజయవాడలో ఆర్థిక సహాయం
పోలీసులను చూస్తే చిన్నారులకే కాదు.. పెద్దలకూ బెదురే. గంభీరంగా కనిపించే వారి వద్దకు వెళ్లేందుకు ఎవరూ సాహసించరు. కానీ విజయవాడకు చెందిన ఓ పోలీసు కానిస్టేబుల్ అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారికి ఆర్థిక సహాయం అందించి శభాష్ అనిపించుకున్నారు.

కానిస్టేబుల్ ఔదార్యం... చిన్నారి వైద్యానికి ఆర్థిక సహాయం