ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇల్లు కావాలంటూ... నిరుపేదల అర్జీలు

సొంతిల్లు లేని నిరుపేదలు.. స్పందన కార్యక్రమాల్లో ప్రభుత్వానికి తమ సమస్యను విన్నవించుకుంటున్నారు. ఇప్పటికే డీడీలు కట్టినా.. ఎక్కడ ఇల్లు ఇస్తారో తెలియక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు.

spandana-program

By

Published : Jul 27, 2019, 12:28 PM IST

ఇళ్ల కోసం స్పందన కార్యక్రమానికి బారులు

స్పందన కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి సమస్యలపై దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా.. విజయవాడ నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన స్పందనకు.. సొంతింటి కోసం అర్జీలు పెద్ద సంఖ్యలో దాఖలయ్యాయి. గతంలో ప్రధాన మంత్రి ఆవాస యోజన పథకం కింద డబ్బులు చెల్లించి ఇప్పటికీ ఇంటి కోసం నిరీక్షిస్తున్న వారు... దరఖాస్తులు చేసుకుంటున్నారు. గతంలో ఇంటి కోసం అప్పులు చేసి లక్ష రూపాయలు చెల్లించామని....డీడీలు కట్టించుకుని ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ ఇళ్లు ఎక్కడ ఇస్తారో తెలియడంలేదని బాధితులు వాపోతున్నారు. ఈ సమస్య చెప్పుకుందామని కార్పొరేషన్ కార్యాలయానికి వస్తే... రెండు, మూడు నెలల ఆగాలంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని.... అప్పులకు వడ్డీలు ఓ వైపు, ఇంటి అద్దెలు మరోవైపు కట్టలేక దిక్కుదోచని స్థితిలో ఉన్నామని ఆవేదన చెందుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details