భార్యను కిరాతకంగా చంపిన భర్త ఉదంతంపై.. మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడు ప్రకాష్.. నరరూప రాక్షసుడిగా మారి ఇలాంటి చర్యకు పాల్పడ్డాడని అన్నారు. బాధిత కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. నిందితుడిని వెంటనే పట్టుకుని తగిన శిక్ష విధించాలని పోలీసులను కోరారు. హోంమంత్రి సుచరిత బాధితులను కలవకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. హంతకుడి నుంచి కుటుంబీకులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
మణిక్రాంతి కుటుంబ సభ్యులకు నన్నపనేని పరామర్శ - paramarsha
ఇటీవల భర్త చేతిలో హత్యకు గురైన మణిక్రాంతి కుటుంబసభ్యులను మహిళా కమిషన్ మాజీ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి పరామర్శించారు.
నన్నపనేని పరామర్శ