విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో భద్రత ప్రమాణాల దృష్ట్యా భద్రత, అగ్నిమాపక , సాధారణ పరిపాలన సిబ్బంది కలిసి మాక్‌డ్రిల్ నిర్వహించారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ అధారిటీ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగ్గా.. విమానాశ్రయలో ఎవరైనా ఆగంతకులు బాంబు పెడితే దానిని ఏవిధంగా నిర్వీర్యం చేయాలి, క్షతగాత్రులను అత్యంత వేగంగా ఆసుపత్రికి ఎలా తరలించాలి అనే అంశాలపై సిబ్బంది చేసి చూపించారు. ప్రతి ఏడాది ఇదే విధంగా వివిధ భద్రత శాఖల సమన్వయంతో విమానాశ్రయంలో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నామని, భద్రతాపరంగా గన్నవరం విమానాశ్రయానికి ఎటువంటి ఢోకా లేదని యాక్టింగ్ ఏపీడీ రామాచారి తెలిపారు. ప్రయాణికుల భద్రత, విమానాశ్రయ భద్రత కొరకు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటారన్నారు.
గన్నవరం విమానాశ్రయంలో మాక్‌డ్రిల్..భద్రత కోసమే..
గన్నవరం ఎయిర్ పోర్ట్ అధారిటీ నేతృత్వంలో మాక్‌డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విమానాశ్రయలో ఎవరైనా ఆగంతకులు బాంబు పెడితే దానిని ఏవిధంగా నిర్వీర్యం చేయాలి, క్షతగాత్రులను అత్యంత వేగంగా ఆసుపత్రికి ఎలా తరలించాలనే అంశాలపై సిబ్బంది చేసి చూపారు.
గన్నవరం విమానాశ్రయంలో మాక్‌డ్రిల్