బలహీనవర్గాల భూములను లాక్కోవడానికి సిగ్గుగా లేదా అంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ప్రశ్నించారు. అనంతపురం జిల్లా, రాప్తాడు నియోజకవర్గం, తూముచెర్ల గ్రామంలో బలహీనవర్గానికి చెందిన మహిళా రైతు లక్ష్మీదేవికి చెందిన భూమిని స్థానిక వైకాపా నాయకుల ఒత్తిడితో స్వాధీనం చేసుకోవడానికి పోలీసులు, రెవిన్యూ సిబ్బంది ప్రయత్నించారని లోకేశ్ ఆరోపించారు. మహిళా రైతు పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించేలా చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కోర్టులో కేసు ఉండగానే భూమిని చదును చేసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. న్యాయస్థానాలు అంటే లెక్క లేకుండా వ్యవహరిస్తున్న అధికారులు, బలహీనవర్గ ప్రజలను వెంటాడి వేధిస్తున్న వైకాపా నాయకులు మూల్యం చెల్లించుకోక తప్పదని లోకేశ్ హెచ్చరించారు. రాప్తాడు ఘటనకు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
బలహీనవర్గాల భూములనూ.. వైకాపా ప్రభుత్వం వదలట్లేదు: లోకేశ్ - లోకేశ్ తాజా వార్తలు
బలహీనవర్గాలకు చెందిన వారిపై సీఎం జగన్ కక్ష కట్టారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. 15 నెలల పాలనలో 2 శిరోముండనాలు, 60 దాడులు జరిగాయని మండిపడ్డారు. ఇప్పుడు ఏకంగా బలహీనవర్గాలకు చెందిన భూములు బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపించారు.
lokesh