ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రామ, వార్డు సచివాలయాలు అందుకోసమే..: మంత్రి కొడాలి నాని - minister kodali nani on schivalys

కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం మల్లాయిపాలెం గ్రామంలోని అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. ప్రభుత్వ పాలనను నేరుగా ప్రజలకు అందించేందుకే గ్రామాలలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్​లను సీఎం జగన్​ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నారని మంత్రి కొడాలి నాని తెలిపారు. గ్రామ సచివాలయం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలను మంత్రి ప్రారంభించారు.

kodali nani inagurated rbk at gudiwada mandal mallapalem
kodali nani inagurated rbk at gudiwada mandal mallapalem

By

Published : Aug 27, 2021, 7:39 PM IST

కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం మల్లాయిపాలెం గ్రామంలో రూ.79.30 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలను పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. ప్రభుత్వ పాలనను నేరుగా ప్రజలకు అందించేందుకే గ్రామాలలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్​లను సీఎం జగన్​ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నారని మంత్రి కొడాలి నాని కొనియాడారు.

సిటిజన్ అవుట్రిచ్ క్యాంపెయిన్​లో భాగంగా మంత్రి కొడాలి నాని, కలెక్టర్ నివాస్​ గుడివాడలోని 9వ వార్డు పరిధిలో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కృష్ణాజిల్లాలో ఈ రోజు నుంచి ప్రారంభమైన సిటిజన్ అవుట్రిచ్ క్యాంపెయిన్​లో భాగంగా.. ప్రతి నెల చివరి శుక్ర, శనివారాల్లో సచివాలయ కార్యదర్శులు.. ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటారని కలెక్టర్ నివాస్ తెలిపారు. ప్రజలకు, సచివాలయాలతో మరింత బంధాన్ని పెంచేందుకే ప్రభుత్వం సిటిజన్ అవుట్రిచ్ క్యాంపెయిన్ ప్రారంభించిందని మంత్రి కొడాలి నాని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు మాధవిలత, శివ శంకర్, పలువురు అధికారులు పాల్గొన్నారు

ఇదీ చదవండి: Krishna Tribunal: 'కృష్ణా ట్రైబ్యునల్‌'పై తెలంగాణ పిటిషన్‌ 'విత్‌డ్రా'కు అడ్డంకి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details