కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలం నిడమానూరులోని ఓ విద్యాసంస్థలో విద్యాశాఖ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఆ యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులపై తనిఖీలు చేపట్టినట్లు విద్యాశాఖ కమిషన్ ఛైర్ పర్సన్ విజయశాంతా రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తున్నట్లు గుర్తించామన్నారు.ఒక్కో తరగతి గదిలో 40 మంది విద్యార్ధులను ఉంచాలని నిబంధనలు ఉంటే వాటిని పట్టించుకోకుండా.. సుమారు 60- 70 మందిని కూర్చోబెడుతున్నారని తెలిపారు. విద్యార్థులకు శానిటైజర్లు అందుబాటులో ఉంచలేదని గుర్తించామన్నారు. అలాగే పిల్లలకు భోజన సదుపాయాలు అంతంత మాత్రంగా అందుతున్నాయన్నారు. యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విజయశాంతా వెల్లడించారు.
ప్రైవేటు విద్యాసంస్థలో అధికారుల ఆకస్మిక తనిఖీలు - ప్రైవేటు విద్యాసంస్థల్లో అధికారుల తనిఖీలు
విజయవాడ రూరప్ పరిధిలోని ఓ విద్యాసంస్థలో విద్యాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ నియమాలను బేఖాతరు చేస్తున్నట్లు గుర్తించారు. విద్యాసంస్థ తీరుపై చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

Inspections
TAGGED:
రాష్ట్ర విద్యాశాఖ అధికారులు