Fight for Roads: కృష్ణా జిల్లా గుడివాడలో రహదారుల నిర్మాణం చేపట్టాలంటూ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నిత్యం వేల మంది ప్రయాణించే విజయవాడ రహదారి దుస్థితిని వివరిస్తూ గుంతలను మీడియాకు చూపించారు. రహదారులను తక్షణమే నిర్మించాలని నినదించారు.
అనంతరం ఏఎన్ఆర్ కళాశాల వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేయగా..రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో పోలీసులు, తెదేపా నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రజల నుంచి కోట్ల రూపాయలు పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వం.. కనీసం గుంతలు పూడ్చకపోవడం దారుణమని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు మండిపడ్డారు.