ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 15, 2020, 6:17 PM IST

ETV Bharat / state

'అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్ని ఆదుకోండి'

అకాల వర్షాలు, ప్రకృతి విలయాలతో తీవ్రంగా నష్టపోతున్న అన్నదాతలను ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కృష్ణా జిల్లా రైతులు కోరారు. ఈ మేరకు నూజివీడు సబ్ కలెక్టరుకు వినతిపత్రం ఇచ్చారు.

farmers letter to nuzivid sub collector in krishna district
సబ్ కలెక్టర్​కు రైతుల వినతిపత్రం

అకాల వర్షాలు, ప్రకృతి విలయాలతో తీవ్రంగా నష్టపోతున్న అన్నదాతలను ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను రైతులు కోరుతున్నారు. ఈ మేరకు కృష్ణా జిల్లా నూజివీడు సబ్ కలెక్టర్ ప్రతిష్ట మాంగైన్​కు రైతు బృందం వినతిపత్రం అందజేసింది.

రైతులు మాట్లాడుతూ.. విత్తన పత్తిని ప్రభుత్వం గుర్తించకపోవటంతో నష్టపోయిన రైతులు పరిహారం పొందలేకపోతున్నారన్నారు. నూజివీడు డివిజన్ పరిధిలో 2,500 ఎకరాల మేర విత్తన పత్తిని సాగుచేశామన్నారు. ఎకరానికి లక్ష వరకు పెట్టుబడి పెట్టామని.. అధిక వర్షాల కారణంగా నష్టపోయామని వాపోయారు. ప్రభుత్వం స్పందించి పరిహారం అందజేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details