కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం పాఠంపాడు గ్రామంలో హెచ్పీసీఎల్ పైపులైను అధికారులను ప్రజలు అడ్డుకున్నారు. తమ అనుమతి లేకుండా, సరైన నష్టపరిహారం చెల్లించకుండా పైపులైను పనులు జరగనివ్వబోమని రైతులు నిరసన తెలిపారు. తోటరావులపాడు, చందర్లపాడు, కొండపేట, కొడవటికల్లు, పొక్కునూరు గ్రామాల మీదుగా పైపులైను వెళుతుంది. రైతులకు సరైన ధర చెల్లించకుండా పనులు జరపాలని సంవత్సరం కాలంగా చేస్తున్న ప్రయత్నాలను రైతులు అడ్డుకుంటున్నారు.
చందర్లపాడులో అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు - కృష్ణాజిల్లా వార్తలు
చందర్లపాడు మండలం పాఠంపాడు గ్రామంలో హెచ్పీసీఎల్ పైపులైను అధికారులను ప్రజలు అడ్డుకున్నారు. తమ అనుమతి లేకుండా సరైన నష్టపరిహారం చెల్లించకుండా పైపులైను పనులు జరగనివ్వబోమని రైతులు నిరసన తెలిపారు.
ఇప్పటికే మూడు సమావేశాలు జరిగినా రైతులకు ఎటువంటి న్యాయం జరగకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కొండపల్లి నుంచి ప్రారంభం అవుతున్న పైపులైను పనులకు... ఐఓసీ కంపెనీ రైతులకు సెంటు రూ.6760 చెల్లిస్తుంచే... హెచ్పీసీఎల్ పైపులైను వారు కేవలం రూ.3600 మాత్రమే చెల్లించి రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు.
స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు తమ సమస్యను గుర్తించి రైతులకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. విషయం తెలుసుకున్న సీపీఎం ప్రతినిధి బృందం ఘటనా స్థలానికి చేరుకొని రైతులకు మద్దతు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకుని... రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సీపీఎం నేత కె.గోపాల్ కోరారు.