రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని మాజీ మంత్రి పీతల సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రిలో సామూహిక అత్యాచార బాధితురాలికి కరోనా పాజిటివ్ అంటున్నారని.. అది నిజమా! కాదా! అని ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బాలిక ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులెటిన్ విడుదల చేయాలన్నారు. ఆమె కేసులో దిశ చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఎస్సీ శిరోముండనం కేసులో ఏ1, ఏ2లను అరెస్ట్ చేయకుండా.. ఏ7గా ఉన్న ఎస్సైని ఎందుకు అరెస్ట్ చేశారన్నారు.
'రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది'
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. రాజమండ్రిలో సామూహిక అత్యాచార బాధితురాలి హెల్త్ బులెటిన్ విడుదల చేయాలన్నారు.
పీతల సుజాత, మాజీ మంత్రి