విజయవాడలోని గుణదల ఈఎస్‌ఐ వైద్యశాలలో నిర్వహణ లోపాలపై రోగులు మండిపడుతున్నారు.ఆస్పత్రి భవనం సైతం పెచ్చులూడిపోయి...సరైన వసతులు లేక రోగులకు కష్టాలు తప్పడం లేదు.జిల్లా వ్యాప్తంగా కార్మికులు ఇక్కడికి అధిక సంఖ్యలో తరలివస్తారు.వైద్యశాలలో తగినంత మంది సిబ్బంది లేక రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.దీనికితోడు అరకొర మందులతో సరిపెడుతున్నారు.ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోలేక ఇక్కడికి వస్తే...తమను ఆదుకునే వారే కరవయ్యారని రోగులు అంటున్నారు.
ఈఎస్‌ఐ ఆస్పత్రిలో రోగుల అవస్థలు
కార్మిక బీమా వైద్యశాలలో రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. మెరుగైన వైద్యం కోసం ఈఎస్‌ఐ ఆస్పత్రికి వస్తే... అరకొర మందులతోనే పంపిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే... సమాధానం ఇవ్వకపోగా... ఈఎస్‌ఐ సిబ్బంది తమపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు.
esi-patients-problems-in-vijayawada-andhrapradesh
తమ వేతనాల నుంచి ఈఎస్‌ఐ డబ్బులు జమ అవుతున్నా...వైద్యం కోసం అర్థించాల్సి వస్తోందని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందిచడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని రోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.