ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

50మంది అర్చకులను సన్మానించిన దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం - విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం గురించి

శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం 50 మంది అర్చకులను సన్మానించింది. ఇంద్రకీలాద్రిపై ఉన్న మహామండపంలోని 6వ అంతస్థులో ఘనంగా అర్చక సభను నిర్వహించారు. అర్చక సభలో పాల్గొన్న అర్చక స్వాములకు 3,500 నగదు పురస్కారం, అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం బహుకరించారు.

Durgamalleswaraswamy
Durgamalleswaraswamy

By

Published : Oct 22, 2020, 9:44 PM IST

శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం 50 మంది అర్చకులను సన్మానించింది. దేవాలయాల నిర్వహణలో పంచప్రాణాలలో తొలి స్థానం నిలిచే అర్చకులు సన్మానించే అనవాయితీ కొనసాగిస్తున్నట్లు దేవస్థానం ఛైర్మన్ పైలా సోమినాయుడు అన్నారు. కరోనా నేపథ్యంలో 50 మంది అర్చక స్వాములను గౌరవించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ప్రతి దేవాలయాలకు పంచ ప్రాణాలుగా ఉంటాయని పురాణాలు చెబుతున్నాయని ఆలయ ఈఓ ఎంవీ సురేష్ బాబు అన్నారు. వాటిలో అర్చకులు ప్రధమ ప్రాణం అయినా అర్చకులను సన్మానించే అవకాశం తనకు రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ప్రధాన అర్చకులు వై. మల్లేశ్వరశాస్త్రి, కనక సుందర శర్మ, ఎల్​డి ప్రసాద్, లింగంబట్ల మధురనాధ్ బాబు, ఏఈఓ సుధారాణి ఆధ్వర్యంలో అర్చక సభ నిర్వహించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details