ప్రభుత్వాసుపత్రుల్లో వెంటిలేటర్లు, బెడ్లు ఎన్ని ఉన్నాయో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని మాజీమంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలను ముఖ్యమంత్రి పరిశీలించాలని కోరారు. కరోనా నియంత్రణ అంటూ సీఎం జగన్ తేలిగ్గా కొట్టిపారేయటం వల్లే సామాజిక వ్యాప్తి మొదలైందని విమర్శించారు. ప్రాణాలు పోతున్నా అంబులెన్స్ లు రావడంలేదని దుయ్యబట్టారు. అంబులెన్సుల పేరుతో రూ.307 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. రాజ్యాంగం పట్ల వైకాపాకు గౌరవం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాలను కోర్టులు తప్పుబట్టినా మార్పు రావడం లేదని ధ్వజమెత్తారు.
ప్రభుత్వాసుపత్రుల్లో వెంటిలేటర్లు ఎన్ని ఉన్నయో చెప్పాలి: దేవినేని
ప్రభుత్వాసుపత్రుల్లో వెంటిలేటర్లు, బెడ్లు ఎన్ని ఉన్నాయో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని మాజీమంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలను ముఖ్యమంత్రి పరిశీలించాలని కోరారు.
ప్రభుత్వాసుపత్రుల్లో వెంటిలేటర్లు ఎన్ని ఉన్నయో చెప్పాలన్న దేవినేని