సీఎం జగన్ అవినీతి రహిత పాలన అందిస్తున్నారు: వెల్లంపల్లి - CM pics offering corruption free: Minister Vellampally
గత ప్రభుత్వంలో వ్యాపారులను బెదిరింపులకు గురి చేశారని...కానీ వైకాపా ప్రభుత్వంలో అలాంటి వాటికి చోటు ఉండవని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. విజయవాడలో వ్యాపారస్తులు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

సీఎం జగన్ అవినీతి రహిత పాలన అందిస్తున్నారు: వెల్లంపల్లి
సీఎం జగన్ అవినీతి రహిత పాలన అందిస్తున్నారు: వెల్లంపల్లి
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు విజయవాడ హోల్సేల్ కమర్షియల్ కాంప్లెక్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ... నియోజకవర్గ ప్రాధాన్యతే తన మొదటి ప్రాధాన్యత అని అన్నారు. వ్యాపారులను గత ప్రభుత్వంలో బెదిరింపులకు గురి చేశారని..కానీ వైకాపా ప్రభుత్వంలో అవినీతికి తావు లేకుండా పాలనను అందిస్తున్నారని అన్నారు. వ్యాపారులు నిర్భయంగా ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు.