సీఎం జగన్‌ను వెనకబడిన వర్గాల, దళితగిరిజన, మైనారిటీ వర్గాల ప్రజాప్రతినిధులు సన్మానించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు నామినేటెడ్ పదవులు, ప్రభుత్వ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు. శాసనసభలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌కు వెళ్లిన బీసీ సంక్షేమ శాఖా మంత్రి శంకర నారాయణ, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు, విడదల రజని, ధనలక్ష్మి తదితరులు... జగన్‌కు కిరీటం, కంఠ మాలలు వేసి సత్కరించారు. వెనుకబడిన వర్గాలు, దళితులు, గిరిజనులు, మహిళల కోసం వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సువర్ణాధ్యాయమని ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు.
రిజర్వేషన్ల బిల్లులపై.. సీఎంకు సన్మానం - s felicitated
వెనుకబడిన వర్గాలు, దళితులు, గిరిజనులకు నామినేటెట్ పదవుల్లో 50 రిజర్వేషన్లు, మహిళలకు 50 శాతం రిజర్వేషన్ల కల్పనకు బిల్లు ప్రవేశపెట్టినందుకు సీఎం జగన్‌ను ఆయా వర్గాల నేతలు సత్కరించారు.

రిజర్వేషన్ల బిల్లులపై హార్షం...సీఎంను సత్కరించిన నేతలు
రిజర్వేషన్ల బిల్లులపై హార్షం...సీఎంను సత్కరించిన నేతలు
ఇదీ చదవండి : కీలక బిల్లులకు రాష్ట్ర శాసనసభ ఆమోదం
Last Updated : Jul 23, 2019, 10:38 PM IST